V1News Telangana

best news portal development company in india

పలు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న “కోనేరు చారిటబుల్ ట్రస్ట్”…..

SHARE:

– కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు 65 మందికి బ్యాగులు పంపిణీ

– పేద ప్రజలకు సహకరించడం ఆత్మ సంతృప్తినిస్తుందని వెల్లడి

– విద్యార్థులు ఆత్మస్థైర్యంతో, పట్టుదలతో విద్యలో విజయాలు సాధించాలని పలు సూచనలు

– “కోనేరు చారిటబుల్ ట్రస్ట్” అధినేత కోనేరు వెంకట సుబ్బారావ్

కోటగిరి ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజు 65 మంది పేద విద్యార్థులకు “కోనేరు చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని గొప్ప సంకల్పంతో, సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావలసిన పుస్తకాలు, స్కూల్ బ్యాగులు అందిస్తున్నారని తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాపారావ్ మాట్లాడుతూ NRI కోనేరు శశాంక్ పేద ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలవడం గర్వించదగ్గ విషయమని కొనియాడుతూ అభినందించారు.ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత కోనేరు వెంకట సుబ్బారావ్,బిజెపి కోటగిరి మండల ప్రధాన కార్యదర్శి విలాస్, బి.శ్యామ్,వెంకటేష్, పొతంగల్ మండల సీనియర్ నాయకులు మార్కెళ్లి ప్రకాష్ పటేల్, రుద్రూర్ మండల బీజేపీ అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం నర్సింలు, సుధీర్, రాధిక మరియు విద్యార్థుల తల్లి తండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india