V1 న్యూస్ – నిజామాబాద్ జిల్లా స్పెషల్ రిపోర్ట్ | జూలై 17
మంజీరా మాఫియా ధ్వంసం – “ఇంద్రమ్మ ఇంటి” పేరిట అక్రమ ఇసుక రవాణా!
అధికారుల మౌనంపై గ్రామస్తుల ఆగ్రహావేశం
బోధన్ – సాలూర ప్రాంతాలు | కల్దుర్కి, చిన్నమావంది. హంగార్గా. కోపర్గా.
మంధర్నా మంజీరా నది పక్కనే ఇప్పుడు చట్టాలు చెల్లుబాటు కాకపోతున్నాయంటే అది అతిశయోక్తి కాదు. ఇక్కడ మాఫియా హోదాలో దూసుకెళ్తున్న అక్రమ ఇసుక రవాణా స్వేచ్ఛాయుతంగా సాగుతోంది. “ఇంద్రమ్మ ఇంటి” పేరిట వే బీలు తీసుకుని, ఇసుకను నిర్మాణాలకోసం కాదు – మాఫియాల గిడుగు గుడిసెల కోసం తరలిస్తుండటం కల్లోలం సృష్టిస్తోంది.

పేపర్లో ఇల్లు.. మైదానంలో మాఫియా?
ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో తీసిన వే బీలు కేవలం బూటకమా? నిర్మాణం కనిపించకపోవడం వెనుక అధికారుల కనీస అవగాహనలేమా? లేక వారే కుట్రలో భాగమా? అనే తీవ్రమైన సందేహాలు ప్రజలలో చర్చనీయాంశంగా మారాయి.

పౌరులు కాదు.. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దళారులే!
ప్రతి కార్యాలయంలో ప్రజలు కన్నా ఇసుక దళారులే కనిపిస్తున్న వాస్తవం శోచనీయం. అధికార వ్యవస్థ దళారుల ధెబ్బకు తల వంచిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. “ఇందమ్మ ఇంటి ఇసుక ఇంట్లో కనిపించదు.. మాఫియాల ముసుగులో మాయం!” అంటూ గ్రామస్తుల వేదన వ్యక్తమవుతోంది.
రవాణా మార్గాల్లో భయానక నృత్యం – ట్రాక్టర్ల పరిగెత్తులు!
రోజు రోజుకీ ట్రాక్టర్ల వేగం రోడ్డుపై జీవన ముప్పుగా మారింది. ట్రాక్టర్ల వేగాన్ని మించినదీ అధికారుల నిశ్శబ్దం! వాహనదారులు తాము రక్షించబడుతున్నామా అనే అనుమానంతో వణికిపోతున్నారు. ప్రజల కామెంట్ ఘాటు — “డీజిల్ ఖర్చులు మాఫియా భరిస్తోందట.. అందుకే కదా ఆపలేరు!”

ప్రజల హెచ్చరిక స్పష్టంగా వినిపిస్తోంది:
ఇకనైనా జిల్లా స్థాయి అధికారులు మౌనం వీడి, కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. “మాఫియా భీషణానికి అంతు లేకపోతే ప్రజల సహనం కోల్పోతుంది” అంటూ తీవ్ర హెచ్చరికలు జారిపడుతున్నాయి.
V1 న్యూస్ ప్రత్యేకం | వాస్తవాలు – నిర్భయంగా – నిష్పక్షపాతంగా
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








