V1News Telangana

best news portal development company in india

విద్యతోనే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి….

SHARE:

– ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్ని మౌళిక వసతులు కల్పించాలి

– కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణీ

– విద్యార్థులు క్రమశిక్షణతో,శ్రద్ధగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని పలు సూచనలు

– విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

పొతంగల్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా: బాన్సువాడ నియోజకవర్గం పొతంగల్ మండల పరిధిలోని సుంకిని గ్రామంలో గల ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ నిరుపేద విద్యార్థులకు 41 మందికి స్కూల్ బ్యాగులను మరియు పుస్తకాలను కామారెడ్డి జిల్లా పర్యావరణ కమిటీ కన్వీనర్ మార్కెల్లి ప్రకాష్ పటేల్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు ఎదగాలని.. గొప్ప సంకల్పంతో, సేవా భావంతో బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉపాధ్యాయులతో సందేహాలను నివృత్తి చేసుకుంటూ శ్రద్ధగా, అంకితభావంతో చదువుకుని మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు సంపాదించి పెట్టాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మాట్లాడుతూ కోనేరు శశాంక్ కోటగిరి మండలంలోని ఎత్తొండ అని మారుమూల గ్రామంలో జన్మించి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదిగి అమెరికాలో స్థిరపడ్డారని విద్యార్థులకు తెలిపారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ మాతృదేశంపై మమకారంతో పేద ప్రజలకు తనువంతుగా ఏదైనా సేవ చేయాలని దృఢ సంకల్పంతో “కోనేరు చారిటబుల్ ట్రస్టును”స్థాపించి దాని ఆధ్వర్యంలో వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలవడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులను మరియు పుస్తకాలను అందించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు కోనేరు శశాంక్ మానవతా దృక్పథం పట్ల అతన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం బీజేవైఎం కన్వీనర్ మల్లెపూల రాజా గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, సుంకిని గ్రామ బూత్ అధ్యక్షులు నాగనాథ్, లక్ష్మణ్, శంకర్ పటేల్, రాజు, నరేష్, ప్రహ్లాద్, నగేష్, పాఠశాల ఉపాధ్యాయులు అరుణకుమారి, స్వరూప రాణి, లావణ్య, గంగాధర్, సాయి రెడ్డి, సుధాకర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india