వర్షాలు సమృద్ధిగా కురిసి జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలిహాజరైన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సిపి సాయి చైతన్యలుప్రతి ఆషాడమాసం లో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ లోని శ్రీశ్రీశ్రీ నవదుర్గ మాత ఆలయంలో టీఎన్జీవోస్ అధ్యక్షుడు సుమన్, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సిపి సాయి చైతన్య లు హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా,ఆనందోత్సవాల మధ్య ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా సుభిక్షంగా ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నారు. టీఎన్జీవోస్ వారు ప్రతి సంవత్సరం నవదుర్గ మాత ఆలయంలో బోనాల పండగ నిర్వహించడం ఎంతో శుభ సూచకమని,అమ్మవారి దయతో వివిధ శాఖలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు, ఎలాంటి అవరోధాలు లేకుండా, సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించాలని కోరారు. అలాగే ఇంత పెద్ద ఎత్తున టీఎన్జీవో అధ్యక్షుడు సుమన్ కులమతాలకు అతీతంగా అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేయడంతో పాటు మహా అన్నదాన ప్రసాదం వితరణ కార్యక్రమం చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరిగినవని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రూరల్ శాసనసభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీసు సాయి చైతన్యకి,ముఖ్యంగా ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించడానికి ప్రతినిత్యం నా వెన్నెంటి ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్న రాష్ట్ర ఉద్యోగుల ప్రతినిధి, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్, టి ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్న కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడానికి మహిళలు ప్రధాన కారణమని వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ
కార్యక్రమంలో రాష్ట్ర ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, నూడా చైర్మన్ కేశవేణు,టిఎన్జీవో సెక్రటరీ నేతి కుంట శేఖర్, మహిళలు ఉద్యోగ సంఘాల నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








