తాగి బండి నడిపితే జైలుకు పోక తప్పదు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తి కు 03 రోజుల జైలు శిక్ష ఇకముందు ఇలాగే వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిధి రామగుండం జూలై 15:-
రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి. రాజేశ్వరరావు ఆధ్వర్యంలో డ్రంక్&డ్రైవ్ లో దొరికిన 09 మందిని సెకండ్ అడిషనల్ మేజిస్ట్రేట్ గోదావరిఖని, వెంకటేష్ దుర్వ ముందు హాజరుపరుచగా 17,000 /- రూపాయల జరిమానా విధించారు. వీరిలో ఇద్దరు వ్యక్తులు ను రెండవసారి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు 03 రోజుల జైలు శిక్ష విధించారు. ఇందులో ఒ కరీంనగర్ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఇందులో ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ ఉన్నారు. పట్టణ ప్రజలకు మద్యం తాగి వాహనం నడప రాదని మరియు టూవీలర్లు హెల్మెట్లు పెట్టుకోవాలని ఫోర్ వీలర్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Author: Namani Rakesh Netha
STAFF REPORTER RAMAGUNDAM








