పర్యాటక రంగానికి శుభవార్త: విష్ణుం హోటల్ మేనేజ్మెంట్ సంస్థతో నైపుణ్యాలకు కొత్త దిశ.. ప్రపంచ స్థాయి హోటల్ మేనేజ్మెంట్ శిక్షణ.. ఇప్పుడు నిజామాబాద్‌లోనే!….
నైపుణ్యం కలిగిన యువత తయారీకి విష్ణుం ముందస్తు అడుగు..
తెలంగాణ యువతకు అంతర్జాతీయ అవకాశాల గేట్‌వే: విష్ణుం ఇన్స్టిట్యూట్..

విశాల ప్రాంగణం, ఆధునిక వసతులతో శిక్షణా కేంద్రం..
దేశవిదేశాల్లో ఉద్యోగాలకు మార్గం చూపనున్న శిక్షణ..
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన కోర్సులు..
ప్రాక్టికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యం – విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం..
V1 న్యూస్.నిజామాబాద్, జూలై 14:-
తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి తోడ్పడే విధంగా నిజామాబాద్ నగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విష్ణుం హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఘనంగా ప్రారంభమైంది. విశాలమైన ప్రాంగణంలో స్థాపించబడిన ఈ సంస్థ, యువతలో హోటల్ మేనేజ్మెంట్ రంగానికి అవసరమైన నైపుణ్యాలను గాఢంగా అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – “తెలంగాణ పర్యాటక రంగ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో, హోటల్ మేనేజ్మెంట్ సేవలకు భారీగా డిమాండ్ ఏర్పడుతోంది. యువతకు సైద్ధాంతిక విజ్ఞానంతో పాటు ప్రాక్టికల్ శిక్షణను అందించడం మా ప్రాధాన్య లక్ష్యం,” అని వివరించారు.
విష్ణుం సంస్థ ఆధ్వర్యంలో కేవలం హోటల్స్ లోనే కాకుండా విమానాశ్రయాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, క్రూయిజ్లైన్స్, ఫుడ్ ఇండస్ట్రీ వంటి విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలు పొందే విధంగా శిక్షణ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, కస్టమర్ సర్వీస్, టైం మేనేజ్మెంట్ వంటి ముఖ్యమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు నేర్చుకుంటారని తెలిపారు.ప్రశిక్షకులు పరిశ్రమలో అనుభవం కలిగిన నిపుణులే కావడం విశేషం. “ప్రపంచ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఉత్తమ ప్లేస్మెంట్ల కోసం నిరంతరం కృషి చేస్తున్నాం,” అని సంస్థ యాజమాన్యం తెలిపింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








