తెలంగాణ రాష్ట్రంలో హాస్పిటాలిటీ మరియు పర్యాటక రంగాలకు భూతమిచ్చేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విష్ణుం హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్.

నిజామాబాద్ నగరంలో ప్రారంభమైంది..నగరంలో సువిశాలమైన ప్రాంగణంలో కొలువుదీరిన విష్ణుం ఇన్స్టిట్యూట్ రంగంలో వృత్తి నైపుణ్యం కలిగిన నిపుణులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది…

తెలంగాణ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, హోటల్ మేనేజ్మెంట్ సేవలకు డిమాండ్ పెరుగుతుంది. విష్ణుం హోటల్ మేనేజ్మెంట్ లాంటి సంస్థలు ఏర్పాటు కావడం వలన మన యువతకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది.

ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు కేవలం మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ హోటళ్లలో ఉద్యోగాలు పొందుతారని హోటల్ మేనేజ్మెంట్ వారు తెలుపుతున్నారు.. విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత కేవలం హోటల్స్ లోనే కాకుండా అనేక ఇతర రంగాల్లోనూ ఉద్యోగాలు ఉంటాయని, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టీం వర్క్ ,సమస్య పరిష్కారం,కస్టమర్ సర్వీస్, టైం మేనేజ్మెంట్ వంటి అనేక ముఖ్యమైన నైపుణ్యాలను నేర్పుతాయని.. ఈ నైపుణ్యాలు మేనేజ్మెంట్ రంగంలోనే కాకుండా ఏ ఇతర రంగంలోనైనా విజయం పొందడంలో సహాయపడతాయని అన్నారు.కేవలం సైద్ధాంతిగా బోధనకే పరిమితం కాకుండా విద్యార్థులకు ఆచరాత్మక శిక్షణకు అధిక ప్రాధాత ఇస్తుంది… అత్యాధునిక వంటశాలలో రెస్టారెంట్లు బార్లు ఫ్రంట్ ఆఫీస్ సెట్ అప్ లు మరియు ప్లేగ్రౌండ్ వంటి వాటితో ఇక్కడ విద్యార్థులకు వాస్తవ ప్రపంచం అనుభవం లభిస్తుంది…విష్ణుం హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించడానికి కట్టుబడి ఉన్నామని, పరిశ్రమలో దశాబ్దాల అనుభవం ఉన్న నిష్ణాతులైన అధ్యాపకులను నియమించామని మేనేజ్మెంట్ పేర్కొంది…

హోటల్ మేనేజ్మెంట్ కోర్సులన్నీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందింపబడ్డాయని, ప్రారంభంలో వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ అనుభవం మరియు నైపుణ్యాలతో పాటు వేతనం బాగా పెరుగుతోందని అసిస్టెంట్ మేనేజర్ నుండి జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయని యాజమాన్యం పేర్కొంది.. విద్యార్థులకు ఉత్తమ ప్లేస్మెంట్ అవకాశాలను కల్పించడమే తమ సంస్థ ముఖ్య లక్ష్యం అని దాని గురించి అహర్నిశలు కష్టపడుతూ ఉంటామని అన్నారు..
Author: Boddula Ganesh Kumar
Mobile no:-9515959863








