V1News Telangana

best news portal development company in india

కోర్ట్ డ్యూటీ పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం – న్యాయ వ్యవస్థ బలపడేలా విధుల నిర్వర్తనకోసం సూచనలు చేసిన పోలీస్ కమిషనర్…

SHARE:

వీ1 న్యూస్, నిజామాబాద్ | తేదీ: 13 జూలై 2025:-న్యాయవ్యవస్థలో పోలీసుల పాత్రను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నేడు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కీలక సమీక్ష సమావేశం జరిగింది. కోర్ట్ డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోర్ట్ డ్యూటీలో ఉన్న పోలీసులు నేరస్థులకు శిక్ష పడేలా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. సాక్షులను సురక్షితంగా కోర్టులకు హాజరు పరచడం, న్యాయస్థానాల్లో సమయపాలన పాటించడం వంటి అంశాల్లో నిర్దిష్ట కార్యచరణ ప్రకారం పనిచేయాలని సూచించారు.

“మీరు చేస్తున్న సేవలు సమాజంలో న్యాయం కోసం పోరాడే మార్గాన్ని సజావుగా చేస్తాయి. నిర్దాక్షిణ్యంగా, నిబద్ధతతో మీ విధులను నిర్వర్తించండి” అని కమిషనర్ గారు అన్నారు.

అంతేగాక, కేసుల డిస్పోజల్ వేగంగా జరిగేందుకు ప్రతి కేసు గురించి స్పష్టమైన బ్రీఫింగ్ ఉండాలనీ, ముఖ్యమైన కేసుల్లో సంబంధిత SI, CI, ACPలతో సమన్వయం తప్పనిసరి అని పేర్కొన్నారు. కోర్టులో సమయానుసారంగా CC నెంబర్లు, CFR నెంబర్లు నమోదు చేయాలని, సమన్స్‌, వారెంట్లను పకడ్బందీగా అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. చార్జ్‌షీట్లు సమర్పించే ముందు జాగ్రత్తగా పరిశీలించాల్సిన దశలు గురించి సిబ్బందికి వివరించారు.

ఈ సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) శ్రీ బస్వా రెడ్డి, CCRB ఇన్‌స్పెక్టర్ శ్రీ సతీష్, కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్రీ శ్యామ్ కుమార్, IT కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india