వార్తా ప్రతినిధి, వి1 న్యూస్. హైదరాబాద్:-బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తూ సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, డీజీపీకి మరియు శాసన మండలి ఛైర్మన్‌కు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.
తనపై అశ్లీల వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ, మల్లన్నను ఎమ్మెల్సీ పదవిలో నుంచి సస్పెండ్ చేయాలని, అరెస్ట్ చేయాలని కవిత కోరారు. “బీసీ రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేసినందుకు నాకు తీన్మార్ మల్లన్న అనుచితంగా వ్యవహరించారు. బీసీలపై పోరాటం చేస్తే నాపై వ్యక్తిగత దాడులకు దిగడం దురదృష్టకరం,” అంటూ ఆమె పేర్కొన్నారు.
తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ – “కవితకు బీసీలతో కంచం పొత్తా? మంచం పొత్తా?” అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు తీవ్రంగా స్పందించి, మల్లన్న కార్యాలయంపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. దాడిలో కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసమైనట్టు సమాచారం.
ఈ పరిణామాలపై తీన్మార్ మల్లన్న స్పందిస్తూ, “కవిత అనుచరులు నా హత్యాయత్నం చేశారు. నా గన్‌మెన్ గాల్లోకి కాల్చడంతో ప్రాణాలతో బయటపడ్డాను,” అని తెలిపారు.
ఇక ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగింది. ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర రాజకీయ రచ్చగా మారాయి. మహిళల రాజకీయ హక్కుల పరిరక్షణ, స్వేచ్ఛపై ఈ ఘటన మరింత చర్చకు దారితీసేలా కనిపిస్తోంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








