కోటగిరి ఎస్సై సునీల్ కు శభాష్‼️
. ఇసుక మాఫియాపై ఎస్ఐ సునీల్ గట్టి ప్రహారం..
పగలూ, రాత్రీ తేడా లేకుండా గస్తీ – ఇసుక మాఫియాకు కంటిపాపలా ఎస్ఐ సునీల్…
. కోడిచెర్లలో ఇసుక సీజ్ – రెవెన్యూ సహకారంతో ఎస్ఐ సునీల్ గట్టి చర్య…
మాఫియా గుండెల్లో గుణపం.. పోలీస్ గుండెల్లో ధైర్యం…
ఇసుక అక్రమ రవాణాపై కోటగిరి పోలీసులు అప్రమత్తం…
ఇసుక మాఫియాపై ప్రజల ప్రశంసల వర్షం – ఎస్సై సునీల్ కృషికి అభినందనలు…
. ఇసుక డంపులపై వీడియో వైరల్ – వెంటనే స్పందించిన పోలీసులు…
కోటగిరిలో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం…
. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: తహసీల్దార్ హెచ్చరిక…

వి 1న్యూస్.కోటగిరి:-సోషల్ మీడియాలో వైరల్ అయిన ఇసుక డంపులపై స్పందన తక్షణమే వచ్చింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కోటగిరి ఎస్సై సునీల్ నేతృత్వంలో అధికారులు రంగంలోకి దిగారు.
పోతంగల్ మండలం కోడిచెర్ల గ్రామంలో అక్రమంగా డంపు చేసిన ఇసుకను రాత్రి పగలు తేడా లేకుండా గస్తీ కాస్తూ ఎస్సై సునీల్ తన బృందంతో జాగారం చేస్తూ ఎక్కడికీ తరలించకుండా అప్రమత్తంగా ఉండి సీజ్ చేశారు. ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో సుమారు 4–5 ఇసుక కుప్పలు సీజ్ చేశారు.

ఇసుక మాఫియా పై ముడిపెట్టిన ఎస్సై సునీల్ చర్యలు స్థానికంగా ప్రశంసల పుష్పవృష్టి తెచ్చుకున్నాయి. మంజీరా సరిహద్దు ప్రాంతాలలో కోడిచెర్లతో పాటు సుంకిని, కారేగం, పోతంగల్ వన్ బ్రిడ్జి ప్రాంతాల్లో మాఫియా అణచివేతకు ఎస్ఐ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సందర్భంగా తహసీల్దార్ గంగాధర్ కామ్లే మాట్లాడుతూ, “సీజ్ చేసిన ఇసుకను హైవే రోడ్డు పనుల కోసం ఉపయోగిస్తాం. ఇకపై ఎక్కడైనా ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం,” అని అన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని, ప్రజల సహకారం ఎంతో అవసరమని ఎస్ఐ సునీల్ పిలుపునిచ్చారు.
ప్రజలు మాట్లాడుతూ, “ఇలాంటి ధైర్యవంతులు ఉన్న పోలీస్ అధికారుల వల్లే మాఫియా నియంత్రణలోకి వస్తోంది. ఎస్సై సునీల్ చేసిన సేవలకు ప్రజలు ‘శభాష్’ అంటున్నారు.”..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








