V1News Telangana

best news portal development company in india

బీసీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని సాలురా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందన్న రవి అన్నారు….

SHARE:

బీసీలకు 42% రిజర్వేషన్‌పై సాలుర మండలంలో సంబరాలు…

కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు పట్ల బీసీ నాయకుల కృతజ్ఞత సభ….
. రెవంత్ రెడ్డి నిర్ణయానికి ఆనందోత్సవం – స్వీట్లు పంచిన బీసీ నేతలు….
సాలురలో బీసీ నాయకుల సంబరాలు – టపాసులు, జైకారాలు..
42 శాతం రిజర్వేషన్ పై ఆర్డినెన్స్ కు బీసీల నుండి విశేష స్పందన….

వి 1 న్యూస్, నిజామాబాద్ జిల్లా – సాలుర మండలం:-.బీసీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని సాలురా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందన్న రవి అన్నారు.బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సాలురా మండల కేంద్రంలో శనివారం సంబరాలు చేసుకున్నారు.ప్రధాన కూడలి వద్ద టపాకాయలు పేల్చారు.సీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు.కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్,సాలురా పిఎసిఎస్ చైర్మన్అల్లె జనార్ధన్,బీసీ సెల్ అధ్యక్షులు బుద్దె లక్ష్మణ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లె రమేష్,ఖజాపూర్ అశోక్,డిస్కో సాయిలు,సాలురా క్యాంపు రమేష్,లక్ష్మణ్,కేజీ గంగారాం,బిహారి,హన్మంత్,ప్రశాంత్,శివకాంత్,దేవరావు,దేవాదానం,శంకర్,ప్రకాష్,రవి,గౌస్,జాఫర్,బ్రహ్మారెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india