టీజీవీపీ నియామకాలు: మాదరోళ్ల నిఖిల్‌కు డివిజన్ కార్యదర్శి బాధ్యతలు..
. టీఎస్‌వీపీ నాయకుల ఆధ్వర్యంలో బోధన్ లో ఘనంగా నియామక కార్యక్రమం…
బోధన్ టీజీవీపీ పట్టణ అధ్యక్షుడిగా బద్దారం శశిధర్ ఎంపిక…
. విద్యార్థి నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న టీజీవీపీ రాష్ట్ర కమీటీ…
వి1 న్యూస్ బోధన్, జూలై 11:ఈరోజు తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సజ్జనం భాను చందర్ గారి సూచనలతో, జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ మరియు బోధన్ డివిజన్ అధ్యక్షులు మిసాలే నాగేష్ గారి ఆధ్వర్యంలో బోధన్ ఈఓ కార్యాలయంలో టీజీవీపీ కొత్త నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా మాదరోళ్ల నిఖిల్ గారిని బోధన్ డివిజన్ టీజీవీపీ కార్యదర్శిగా, బద్దారం శశిధర్ గారిని బోధన్ పట్టణ అధ్యక్షుడిగా, రగ్తేవాడ్ వీరేష్ గారిని బోధన్ పట్టణ కార్యదర్శిగా నియమించి నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో టీజీవీపీ కార్యకర్తలు విఘ్నేష్, రవి, సవిన్, బాలు, శ్యాహెద్, సాయి, చింటూ, వరుణ్, రోహిత్, సాయికిరణ్, ఓంకార్, కేశవ, ఆయన్, రాహుల్, రాజేష్, లక్ష్మణ్, సాయికృష్ణ, నాగసాయి, బిట్టు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై చురుకుగా స్పందిస్తూ ఉద్యమాలను చేపడతామని, విద్యార్థి శ్రేయస్సే తమ లక్ష్యమని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









