కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలనీ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.హరిత, ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (tuci) రాష్ట్ర నాయకులు రామ్ లక్ష్మన్ డిమాండ్ చేసారు. బుధవారం భైంసాలో దేశావ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐబీ నుండి టిప్పు సుల్తాన్ చౌక్ వరకు ర్యాలీ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశ ప్రదాన మంత్రి నరేంద్ర మోడీ తాను అధికారంలో వస్తే దేశంలో ఉన్న కూటిర పరిశ్రమలను కాపాడుతానని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని హమీ ఇచ్చి తాను అధికరంలోకి వచ్చి 11సంవత్సరాలు అయిపోతున్న నేటి వరకు తానిచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.కనీసం వేతనం 26 వేల వేతనం ఇవ్వాలని, స్వదేశీ జపం చేసిన మోడీ ఆదాని, అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి భారతదేశ కార్మిక వర్గం పైన ఉరితాళ్లు బిగిస్తున్నరని, వారిని కట్టు బానిసలుగా తయారు చేస్తున్నారని ఆరోపించారు. బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీ ఎత్తివేయాలని, రాజీనామా చేసిన కార్మికులందరికీ కనీస పెన్షన్ 9 వేలు ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినా హమీ ప్రకారం బీడీ కార్మికులు అందరికీ ఎలాంటి షరతులు లేకుండా చేయూత పథకం కింద 4 వేల రూపాయల జీవన భృతి ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో tuci జిల్లా అధ్యక్షులు ఎం బక్కన్న, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు ముత్యం, పెయింట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు లతీఫ్, బీడీ కార్మిక నాయకులు దేవిదాస్, సాయిలు, నాగనాథ్, సాయన్న, అనురాధ, సీత,అలీమ్, అక్తర్, ముత్తవ్వ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








