V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో ఏబీవీపీ 77వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా..

SHARE:

బోధన్, జూలై 9:అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) 77వ ఆవిర్భావ దినోత్సవం మరియు జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పట్టణ అధ్యక్షుడు అడ్లూరి శ్రీరామ్ భారతమాత మరియు స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలేసి, ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, “1949లో కొద్దిమంది మేధావుల చేత ప్రారంభమైన ఏబీవీపీ ఈరోజు 60 లక్షల మందికి పైగా సభ్యులతో దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగింది,” అని పేర్కొన్నారు.

జిల్లా ప్రముఖ్ తలాండే ఈశ్వర్ మాట్లాడుతూ, “ఏబీవీపీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వీరులను గుర్తు చేసుకోవాలి. విద్యార్థులు విద్యా దశ నుండే దేశ భక్తి, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలి,” అని సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి కునాల్, నగర ఉపాధ్యక్షుడు సంజయ్, వానవాసి కన్వీనర్ లక్ష్మణ్ చౌహన్, హాస్టల్ ఇంచార్జి వెంకట్ రెడ్డి, కార్యకర్తలు వెంకట్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india