V1News Telangana

best news portal development company in india

బోధన్ కల్దుర్కి మంజీరలో పెట్రేగిపోతున్న ఇసుక మాఫియా దందా! రైతుల పంటలకు భారీ నష్టం…

SHARE:

ఇసుక రవాణాలో రైతుల పంటపొలాలకు వెళ్లే దారులు ధ్వంసం…
నీటి పైపుల ధ్వంసం – వ్యవసాయం ప్రమాదంలో…
రైతుల గాయాలు.. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం…
ఇసుక మాఫియా మీద చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని హెచ్చరిక..

బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలోని మంజీర నది పరిసరాల్లో ఇసుక మాఫియా అల్లకల్లోలం సృష్టిస్తోంది. పంట పొలాలకు ప్రాణవాయువులాంటి నీటి పైపులనే ధ్వంసం చేయడం, ట్రాక్టర్ల రాకపోకల వల్ల రైతుల పొలాల దారులు పూర్తిగా దెబ్బతినడం రైతులను తీవ్రంగా కలచివేస్తోంది.”దేశానికి అన్నం పెడుతున్న మమ్మల్ని బెదిరిస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎటువంటి స్పందన లేదు. మేము పడుతూ లేస్తూ పంటపొలాలకు వెళ్లాల్సి వస్తోంది,” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బురదలో జారిపడి రైతు కాలికి గాయమయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు.”ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఇసుక రవాణా నిర్భందంగా సాగుతోంది. ఇది మా జీవనోపాధిని భగ్నం చేస్తోంది,” అని మరో రైతు వాపోయారు.

ఇసుక మాఫియాను అరికట్టేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోకపోతే, జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు రైతులు హెచ్చరించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india