V1News Telangana

best news portal development company in india

మెగా వైద్య శిబిరం – పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భరోసా! అనారోగ్యానికి మందులకన్నా ముందుజాగ్రత్తే మేలంటూ కమిషనర్ సూచన..

SHARE:

మల్లారెడ్డి, నారాయణ హాస్పిటల్స్ తో కలిసి పోలీస్ శాఖ వైద్య శిబిరం..
పోలీసులకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం – కమిషనర్ పి. సాయి చైతన్య..
. సంస్థాగత ఆరోగ్యానికి సంచలన పూనిక – మెగా వైద్య శిబిరం ప్రారంభం..

పోలీస్ కమిషనర్ కార్యాలయం, నిజామాబాద్…

పోలీస్ సిబ్బందికి మెగా వైద్య శిబిరం – ముందుజాగ్రత్తలే ఆరోగ్య రక్షణకు కీలకం : కమిషనర్ పి. సాయి చైతన్య ఐ.పి.ఎస్.

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మల్లారెడ్డి మరియు నారాయణ హాస్పిటల్స్ హైదరాబాదు సౌజన్యంతో నిర్వహించిన “మెగా వైద్య శిబిరం” ప్రారంభ వేడుకలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారు శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పోలీసులు విధుల్లో నిత్యం మునిగిపోయి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అనారోగ్యాలను దూరం ఉంచేందుకు సమయానుకూల వైద్య పరీక్షలు అవసరం. మందుల కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. నేడు అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలను పూర్తిగా వినియోగించుకోవాలి,” అని అన్నారు.

ఈ మెగా శిబిరంలో ఆర్.బి.ఎస్, కంటి పరీక్ష, ఈసీజీ, 2డి ఈకో, క్యాన్సర్ స్క్రీనింగ్, బిపి, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి. దీనిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల పోలీస్ స్టేషన్లు, హెడ్‌క్వార్టర్స్, హోం గార్డ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్లు బస్వారెడ్డి, రామ్ చందర్ రావు, ఎ.సి.పిలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, శేఖర్ బాబు, తిరుపతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. వైద్య విభాగం తరపున డా. సరళ, డా. సుధాకర్ రావు, డా. చంద్ర మోహన్, డా. వంశీ, డా. అఫ్రిన్, డా. నిఖిత, డా. షాహాబాజ్ హైమద్ వంటి ప్రముఖులు సేవలందించారు.

జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షకీల్ పాషా గారు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india