Post Views: 107
భైంసా, జూలై 8:కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పెట్టుబడిదారుల అనుకూల విధానాలు, కార్మికుల హక్కులను కాలరాయడంపై నిరసనగా రేపు (బుధవారం) నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. హరిత పిలుపునిచ్చారు.
భైంసాలో మంగళవారం జరిగిన సమ్మె ప్రచారంలో ఆమె మాట్లాడుతూ, బీడీ పరిశ్రమపై విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని, రాజీనామా చేసిన బీడీ కార్మికులందరికీ కనీసం రూ.9,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే, నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హమీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ చేయూత పథకం కింద రూ.4,000 జీవన భృతి అందించాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు లక్ష్మి, విజయ, బేబీ, విజయలక్ష్మి, నరేష్, మల్లేష్, గంగాధర్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
Author: chandre Prakash
నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533








