– ప్రజల సమస్యలపై నిరంతరం పారదర్శకంగా పనిచేయాలని విజ్ఞప్తి
– పోలీసులకు ఎల్లవేళలా పార్టీ తరఫున సహకరిస్తామని వివరణ
– బిఆర్ఎస్ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గంలోని నసురుల్లాబాద్ మండలానికి బదిలీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న నూతన ఎస్సై పి. రాఘవేందర్ ను మంగళవారం రోజు బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మరియు టేకుర్ల సాయిలు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరూ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ క్రమంలో వారు పరస్పరం మిఠాయిలు పంచుకొని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్ మాట్లాడుతూ అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎల్లప్పుడూ పోలీసులకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు వెంకటి, మోసీన్,అల్లం రాములు, మంగళి సాయి కుమార్, కూనింటి రాము, తర్ణం పోచయ్య, డి. సాయిలు, దొంతి భాస్కర్, అల్లం గంగారం, గంపల శంకర్, కనుకుట్ల శ్రీనివాస్, రాజు నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..