– అంకితభావంతో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి
– పార్టీ తరఫున ఎల్లవేళలా పోలీసులకు సహకరిస్తామని వివరణ
– బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
నసురుల్లాబాద్ ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలానికి బదిలీపై నూతనంగా విచ్చేసిన ఎస్సై పి.రాఘవేందర్ ను మంగళవారం రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించి.. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ క్రమంలో వారు పరస్పరం మిఠాయిలు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సున్నం సాయిలు మాట్లాడుతూ ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఎస్సై ఉద్యోగాన్ని సంపాదించడం గొప్ప విషయమని కొనియాడారు. అంకితభావంతో విధి నిర్వహణ నిర్వర్తిస్తూ శాంతి భద్రతల పరిరక్షణ చేయాలని.. ఎల్లవేళలా ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తూ అందరి మన్ననలను పొందాలని ఆకాంక్షించారు. ఎల్లప్పుడూ తమ మద్దతు అందిస్తామని ఈ సందర్భంగా ఎస్సై రాఘవేందర్ మాట్లాడుతూ ఘనంగా సత్కరించి స్వాగతం పలికినందుకుగాను బిజెపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు సేవలు అందించడానికి తాను మరియు పోలీసు సిబ్బంది అహర్నిశలు పనిచేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా నాయకులు సున్నం సాయిలు ,జిల్లా నాయకులు వడ్ల సతీష్, సీనియర్ నాయకులు పెర్క రాములు ,అరిగె నారాయణ, మనూర్ సాయిలు, ఉల్లెంగ గోపి, రవి డాక్టర్, కొప్పుల సాయిలు, శేఖర్, ఉల్లెంగ పర్వయ్య ,బ్యాగరి సాయిలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..