Post Views: 52
బోధన్ డివిజన్ లో నిబంధన లకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీ విద్యార్ధి సంఘం ఆధ్వర్యంలో బోధన్ RTO ఆఫీస్ లో MVI D. శ్రీనివాస్ కు వినతిపత్రం అందించారు..
ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు సిరివెసు సంతోష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా అనుభవం లేని డ్రైవర్ లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ లేకుండా, ఎమర్జెన్సీ డోర్ లు లేకుండా బస్సులను నడుపుతున్నారని, ఇలాంటి బస్సులను గుర్తించి వాటిని సీజ్ చేయాలనీ డిమాండ్ చేశారు. వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్న,పరిమితి కి మించి విద్యార్థులను బస్సులలో తరలిస్తూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడుపుతున్న యాజమాన్యలపై చర్యలు తీసుకుంటామని MVI తెలిపారు.
ఈ కార్యక్రమం లో విద్యార్ధి సంఘం నేతలు నరేష్, గంగాధర్, సాయి కుమార్, రోహిత్ తదితరులు ఉన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....