V1News Telangana

best news portal development company in india

సాయి నగర్‌లో పేకాట మాఫియా రెచ్చిపోతోంది – యువకులు బానిసలుగా మారుతున్నారు! . రాత్రి పాడుబడ్డ పాత బంక్ పేకాట కేంద్రం! పగలు చెరువు కట్టపై పేకాట రాజ్యం..

SHARE:

సాయి నగర్ చెరువు కట్టపై పేకాట మాఫియా రెచ్చిపోతున్నది! యువకులు బానిసలు… అధికారులు మౌనమే రక్షణ కవచమా?

నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలోని సాయి నగర్ కాలనీలో పేకాట మాఫియా మరోసారి రెచ్చిపోతున్నది. పాత పేకాట స్థావరాన్ని మక్కాం మార్చి, ప్రస్తుతం పాడుబడ్డ పాత పెట్రోల్ బంక్ పక్కననున్న చెరువు కట్టపై పేకాటను ఘోషగా నిర్వహిస్తున్నారు. ఈ స్థావరాన్ని స్థానిక పాత ఆటగాళ్లే ఆధిపత్యంగా నడుపుతూ, ఎవరి అండదండలతో చట్టాన్ని మోసం చేస్తున్నారు అన్నది చర్చనీయాంశమైంది.

ప్రశ్నించేవారిపై బెదిరింపులు, అత్యధిక వడ్డీకి డబ్బుల వసూళ్లు, మోసపూరిత పద్ధతులతో వచ్చే ఆటగాళ్లను మోసగించడం వంటివి ఈ ముఠా నిర్వాహకుల పనితీరుగా మారాయి. స్థానిక యువతను, కొంతమంది యువకులు విద్యార్థులకూ ఈ పేకాట స్థావరం బానిస చేస్తున్నట్లు సమాచారం. విద్యను వదిలేసి కొంతమంది విద్యార్థులు పేకాట కోసం కాలక్షేపం చేస్తున్నారు అన్నది ఆందోళన కలిగిస్తున్న విషయం.

    oplus_8388608

స్థావరానికి చుట్టుపక్కల రోజువారి కూలీలను నియమించి, ఏ అధికారులయినా వస్తే ముందుగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇలా అధికారుల చేతికి అందకుండా ఉండటమే వారి ప్రధాన వ్యూహం. గతంలో ఇదే గుంపు పేకాట కేసుల్లో పట్టుబడ్డా, సరైన చర్యలు లేకపోవడంతో మళ్ళీ అదే దారిలోకి మళ్లారు.
ఎవరైనా అధికారులు దాడి చేస్తే, “చెరువులోకి దూకేస్తాం – ఏదైనా జరిగితే మీరే బాధ్యులు” అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం??. ఇది చట్టపరమైన భద్రతకు సవాల్గా మారింది. స్థానిక ప్రజలు భయంతో నోరు మెదపలేని స్థితికి చేరుకున్నారు…

ప్రజల విజ్ఞప్తి:

ఇకనైనా సంబంధిత అధికారులు, నిఘా విభాగాలు స్పందించాలి. పేకాట నిర్వహకులపై చర్యలు, ఆర్థిక ముఠాలపై నిఘా, బానిసలా మారుతున్న యువతపై పునరావాస చర్యలు తీసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india