సాయి నగర్… అభివృద్ధి పేరుతో మత్తు మాఫియాల పుట్టినిల్లు!
నిజామాబాద్ జిల్లా సాలుర మండలంలోని సాయి నగర్… పేరుకే అభివృద్ధి ప్రాంతం. కానీ వాస్తవానికి ఇది దో నంబర్ దందాలకు అడ్డాగా మారిపోయింది.ఇక్కడ మట్కా, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు ప్రత్యక్షంగా, నిర్భయంగా నడుస్తున్నాయి.సాయి నగర్ కాలనీ, స్మశాన వాటిక ప్రాంతాలు ఇప్పుడు పేకాట దందాలకు కేంద్రంగా మారాయి. స్థానికులు తెలిసీ తెలియనట్టు ఉండాల్సిన పరిస్థితి. పోలీసులు గతంలో రెండు మూడు సార్లు దాడులు చేసినా, ముఠాలు ముందుగానే సమాచారం తెలుసుకొని తప్పించుకుంటున్నాయి.ఇక్కడ దందాలు ఎంతగా పెరిగాయంటే –
🔹 తాకట్టు పెట్టిన వాహనాలు
🔹 దొంగ బైకులు
🔹 మహారాష్ట్ర నెంబర్లతో నడిచే ఆన్లైన్ మట్కా యాప్‌లు
ఇవి ద్వారా మత్తు వ్యాపారాన్ని నిర్వీర్యంగా సాగిస్తున్నారు.
పాత మట్కా ఏజెంట్లు తలదాచుకుని, కొత్తవారిని రంగంలోకి దించడంతో గుట్టు రట్టవడం లేదు. పాఠశాల విద్యార్థులు సైతం ఈ మత్తుకు బానిసలవుతుండటం గమనార్హం. కొన్ని కుటుంబాల్లో ఆర్థిక నష్టాల వలన ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి.
గతంలో కాటన్ సెర్చ్ చేసిన . లాభం లేకపోలేదు.ఆదే సమయం లోఈ ముఠాలు నది దాటి వాహనాలు దాచి, ఫోన్ ట్రాకింగ్‌కు భయపడి వేదికలు మార్చుతూ, ఆన్లైన్ మాధ్యమాల్లో దందాను కొనసాగిస్తున్నారు.ప్రజల కోరిక…ఇప్పుడు ప్రజలు కోరేది ఒక్కటే –
సాయి నగర్‌ను మళ్లీ శాంతియుత ప్రాంతంగా మార్చాలి.
పోలీసులు పకడ్బందీగా నిఘా పెట్టాలి. ఎప్పటికైనా ఈ మత్తు ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....