V1News Telangana

best news portal development company in india

సాలూరలో పూర్వ విద్యార్థుల సేవా కార్యక్రమం

SHARE:

  • ప్రాథమిక విద్యార్థులకు ప్యాడ్లు, పలకల పంపిణీ..విద్యాభివృద్ధికి ముందుండే పూర్వ విద్యార్థులు… సాలూర పాఠశాల విద్యార్థులకు 13 వేల విలువైన విద్యా సహాయ పరికరాలు..ప్రాథమిక పాఠశాల విజయాల్లో భాగస్వామ్యంగా పూర్వ విద్యార్థులు..

సాలూర, జూన్ 26:
నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం ఒక గొప్ప సేవా కార్యక్రమం జరిగింది. 2003–2004 బ్యాచ్ పూర్వ విద్యార్థులు కలిసి సుమారు రూ.13,000 విలువైన ప్యాడ్లు, పలకలు ప్రస్తుత విద్యార్థులకు అందజేశారు.
విద్యార్థుల అభ్యాసానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని వారు తెలిపారు. ఈ చిన్న సహాయం విద్యార్థుల భవిష్యత్తు బాగు దిశగా వేయబడిన ఒక మంచి అడుగు అని పేర్కొన్నారు.
ఇటీవల పదవ తరగతి ఫలితాలలో 500కి పైగా మార్కులు సాధించిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారని, పాఠశాలలో నాణ్యమైన బోధన జరుగుతోందని మరియు ఉపాధ్యాయ బృందం కృషిని సూచించడమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సాలూర మండల విద్యాధికారి రాజీ మంజూష, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గంధపు సాయిలు, ఇతర సిబ్బందికి పూర్వ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: భూమయ్య రాజు, ఆల్లే లక్ష్మణ్, భీమ్రావు, మైదప్ లక్ష్మణ్, మోహన్, సంగేపు లక్ష్మణ్, హనుమాడ్లు, సయ్యద్ భాస్కర్, ముజామిల్, రుద్ర సంతోష్ యాదవ్, రాజ్ కుమార్, విట్టల్, మహేష్, కల్లూరి శంకర్, జోష్ణ, స్వర్ణ తదితరులు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india