బోధన్‌లో న్యాయ, పోలీస్ శాఖల కలయికతో డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమం..మాదక ద్రవ్య రహిత సమాజం కోసం ప్రతిజ్ఞ – బోధన్‌లో స్పందన..ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములు కావాలి: జడ్జి ఏ.సంపల్లి…
బోధన్, జూన్ 26:డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ” సంకల్పాన్ని సఫలీకృతం చేయడం ప్రతి పౌరుడి బాధ్యత అని బోధన్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఏ. సంపల్లి సాయి శివ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం & అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రారంభ సభలో బోధన్ జూనియర్ సివిల్ జడ్జి మర్కల్ పూజిత డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేయించగా, సీనియర్ సివిల్ జడ్జి ఏ. కాంచన రెడ్డి జెండా ఊపి ర్యాలీకి శ్రీకారం చుట్టారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ, యువతను ఆరోగ్యకరమైన, బాధ్యతాయుత భవిష్యత్తు వైపు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు.
డ్రగ్స్ వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తుందని, దీనికి ఎదురు నిలవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమానికి భారం కాకుండా బలం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఏసిపి శ్రీనివాస్, సీఐలు వెంకటరమణ, విజయ్ బాబు, ఎస్సైలు, కోర్టు సిబ్బంది, విద్యార్థులు, సివిల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. నగర వీధుల్లో నిర్వహించిన ర్యాలీ ప్రజల్లో విశేష చైతన్యం నింపింది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









