పెంటకూర్డు (బోధన్ మండలం), జూన్ 23:
పెంటకూర్డు గ్రామంలో ఓ దారుణమైన హత్యకేసు వెలుగు చూసింది. స్థానికంగా నివాసముండే గైక్వాడ్ చంద్రకళ (60), మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్టు సమాచారం. ఈమె గత 20 సంవత్సరాలుగా ఒంటరిగా నివసిస్తూ వచ్చారు. మహారాష్ట్రలోని టాక్లికి చెందిన భర్త వెంకటితో విభేదాల కారణంగా విడిపడి ఉన్నారు.
ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. సంఘటన జరిగిన సమయంలో ఆమె ఒంటరిగా ఇంటిలోనే ఉన్నారు. ఘటన అనంతరం ఆమె వద్ద ఉన్న సుమారు 50 తులాల వెండి కాళ్ల కడియాలు మాయమయ్యాయని, స్థానికులు తెలిపారు. అయితే, ఆమె వేసుకున్న బంగారం పుస్తెలతాడు, చెవి కమ్మలు మాత్రం ఉన్నట్లు ఘటనప బోధన్ రూరల్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
దర్యాప్తు కొనసాగుతోంది…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








