బండి కంటే చలాన్లు ఎక్కువ.. వాహనం స్వాధీనం
. “ఒక రూపాయి కూడా కట్టను సార్” – ట్రాఫిక్ పోలీసుల్ని షాక్కు గురిచేసిన వాహనదారుడు
. 20 ఏళ్ల బండి.. 45 వేల చలాన్లు! అస్లాం విన్యాసం
ఒకే వాహనంపై 233 చలాన్లు.. ఇక పోలీసులే యజమానులు!
, జూన్ 22 :ట్రాఫిక్ చట్టాలు ఏంటో పట్టించుకోని ఓ వాహనదారుడు చివరకు బండి కోల్పోయాడు. కాజీపేట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీలలో హన్మకొండకు చెందిన అస్లం అనే వ్యక్తి ద్విచక్ర వాహనంను నిలిపివేసి పరిశీలించగా… ఆశ్చర్యకరంగా ఆ బండిపై 233 పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు బయటపడింది. మొత్తం జరిమానా మొత్తం రూ. 45,350.
ఇంత మొత్తంలో జరిమానా చెల్లించాల్సిన నేపథ్యంలో పోలీసులు బండిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అస్లాం స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. “ఈ బండి 20 ఏళ్ల పాతది సార్.. అమ్మినా 10వేలు రావు. నేను రూపాయి కూడా కట్టను.. మీరు బండిని మీ దగ్గరే ఉంచుకోండి” అని చెప్పి అక్కడి నుంచే వెళ్లిపోయాడు.
పోలీసులు చెబుతున్నదేమిటంటే – చలాన్లను కట్టేవరకు వాహనం విడుదల కాదు. కానీ స్థానికులు చెప్పేది మాత్రం వేరే దిశలో ఉంది. “అస్లాం లాంటి వారు వందలు ఖర్చు పెట్టి బండిని తిరిగి తెచ్చుకోవడం కన్నా, కొత్త బండి కొనడానికే మొగ్గు చూపుతారు” అంటున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








