V1News Telangana

best news portal development company in india

ఇకపై ఒకటే నంబర్: అత్యవసర సేవలకే 112! పోలీసులు, అంబులెన్స్, ఫైర్‌ సేవలు – ఒకే నెంబర్ 112 తెలంగాణలో అమలులోకి 112 ఎమర్జెన్సీ నెంబర్: డీజీపీ జితేందర్ . ప్యానిక్ బటన్ తో సహాయం… 112తో దేశవ్యాప్తంగా ఒకే స్పందన . ఎమర్జెన్సీలో ఒక్కటే కాల్ చాలు: 112 టోల్‌ఫ్రీ సేవ ప్రారంభం…

SHARE:

ఇకపై అన్నింటికీ ఒకటే ఎమర్జన్సీ నెంబర్.. కొత్త నెంబర్ ఇదే!

ప్రజలకు అత్యవసర సమయంలో తక్షణ సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 112 అనే నూతన టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు వేర్వేరు అత్యవసర సేవల కోసం వేర్వేరు నంబర్లు ఉండగా (పోలీసు – 100, అంబులెన్స్ – 108, మహిళల భద్రత – 181, బాలల హక్కులు – 1098), ఇకపై ఈన్నింటికీ బదులుగా ఒక్కటే నంబర్ – 112 అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ తెలిపిన వివరాల ప్రకారం, 112 కాల్ సెంటర్ GPS సాయంతో కాల్ చేసే వ్యక్తి యొక్క లొకేషన్‌ను ట్రాక్ చేసి సంబంధిత శాఖలకు సమాచారాన్ని వేగంగా చేరుస్తుంది. పోలీస్, అంబులెన్స్, ఫైర్ సర్వీసుల మధ్య సమన్వయం ద్వారా స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక పరికరాలతో వ్యవస్థను అప్‌గ్రేడ్ చేశారు.

24/7 పనిచేసే ట్రెయిన్డ్ సిబ్బంది, స్మార్ట్‌ఫోన్లలో ప్యానిక్ బటన్ సదుపాయం, 112 India App వంటి ఆధునిక టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. మహిళల భద్రత కోసం SOS ఫీచర్లు, ఫేక్ కాల్ వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి.

ఇకపై స్కూళ్లు, కాలేజీలు, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీవీ, పత్రికలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారం అందిస్తున్నామని అధికారులు తెలిపారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india