V1News Telangana

best news portal development company in india

అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పోలీస్ కమీషనర్ పాల్గొనడం హర్షణీయం…

SHARE:

నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్‌లో ఉన్న శ్రీరామ గార్డెన్‌లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమీషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS గారు హాజరై, జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –
“యోగా మన జీవన శైలిలో ఒక భాగంగా నిలవాలి. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతుంది. ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఇది కీలకంగా పనిచేస్తుంది. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించేందుకు యోగా ఒక పరిష్కార మార్గంగా నిలవగలదు. జూన్ 21న యోగా దినోత్సవం, అదే నెల 26న ‘ఆంటీ డ్రగ్స్ డే’ రావడం అనేది సమకాలీన పరిణామం.” అని వ్యాఖ్యానించారు.
కార్యక్రమంలో పలు యోగా ఆసనాలు ప్రదర్శించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమీషనర్లు బస్వారెడ్డి (అడ్మిన్), రాంచందర్ రావు (ఎ.ఆర్), నిజామాబాద్ ఏసీపీ శ్రీ రాజా వెంకట్ రెడ్డి, అర్బన్ MLA దంపల్ సూర్యనారాయణ, యువజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు, యోగా గురువులు, మరియు ప్రముఖులు సంగీత డాక్టర్ తిరుపతిరావు, గంగాధర్, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india