V1News Telangana

best news portal development company in india

వాసన గుడోడికే… కానీ అధికారులు మూగబోయిన దృశ్యాలు!” సాలూరు – బోధన్ మండలాల్లో మట్కా మహోత్సవం.పాతవాళ్లు పక్కకు – కొత్తవాళ్లే రాజులు!

SHARE:

నిజామాబాద్ జిల్లా:సంగతిని అందరూ చూస్తున్నారు… కానీ చర్య మాత్రం ఎవ్వరూ తీసుకోవడం లేదు. సాలూరు మండలం సాయి నగర్ కాలనీ, మరియు అదేవిధంగా స్మశాన వాటికలో. బోధన్ పట్టణంలోని రంజాల్ బేస్ వీక్లీ మార్కెట్ ప్రాంతాలు – మట్కా దందాకు అడ్డు రావని అసలైన ‘సేఫ్ జోన్’గా మారిపోయాయి. సాలూరు మండలం లోని పాడుబడ్డ పెట్రోల్ బంకులు. అదేవిధంగా స్మశాన వాటిక.ఇప్పుడు పేకాట గుట్టలు… మొబైల్ ఫోన్‌లు చేతిలో ఉంటే చాలు, 24 గంటలపాటు మట్కా లైవ్!

పాతవాళ్లు పక్కకు – కొత్తవాళ్లే రాజులు!

ఇప్పటికే పాత మట్కా ఏజెంట్లు తప్పుకోగా, కొత్త రాక్షసులు రంగంలోకి దిగారు. అధికారుల కన్ను ఎదో మాయావీ తెర వెనుకే ఉందనిపిస్తోంది. స్థానికులు ఏమంటున్నారంటే –
“ఇది కక్కుర్తి కాదు… కవరేజ్ బలమే!”

కనబడేది కాదంటారు… కానీ జనం వినిపించుకుంటున్నారు!

oplus_8388608

ఈ దందా ఏజెంట్లు రాత్రంతా, పగలంతా పని చేస్తూ… యూత్‌ను ముంచుతున్నారు. ఇక అధికార శాఖలకు మాత్రం ఈ మొత్తం గందరగోళం కనబడటం లేదు. లేక… చూస్తూనే ఊరుకుంటున్నారో అన్నదే ప్రజల అనుమానం.

ఎక్కడో కాదు… ఇక్కడే జరుగుతోంది!

ఇది ముంబయి గల్లీల దృశ్యం కాదు… నిజామాబాద్ జిల్లాలోనే జరుగుతోంది. నియంత్రణలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న అధికార యంత్రాంగం మాత్రం స్పందన చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india