V1News Telangana

best news portal development company in india

ఇంద్రమ్మ ఇళ్లలో మొదటి విడత అలాట్మెంట్ పూర్తి – మిగతావారికి నిరీక్షణే! ఇళ్లు కావాలని మిగతా అర్హుల ఆశలు – అధికారుల సూటి స్పందన . . ఇంద్రమ్మ ఇళ్లపై వైరల్ వీడియోకి గ్రామ పెద్దలు అధికారులు కౌంటర్ – దరఖాస్తు చేయలేదని వివరణ ఇళ్ల విషయంలో అవకతవకలు లేవన్న కార్యకర్తల స్పష్టీకరణ…

SHARE:

నిజామాబాద్ జిల్లా, సాలూరు మండలం:
ఇంద్రమ్మ ఇళ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్న పలు కుటుంబాల్లో 67 మందికి మొదటి విడతలో ఇళ్లను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో మిగిలిన అర్హులు తమకు కూడా త్వరగా ఇళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.
అయితే, అధికారులు మాత్రం “ఇప్పటికే మొదటి విడతలో ఎంపికైన వారికి మాత్రమే ప్రస్తుతం ఇళ్లు కేటాయించబడ్డాయి. ఇంకా రెండో విడతలో 15 ఇళ్లకు అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతోంది,” అని స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, ఎంపికపై కొన్ని వర్గాలు అనుమానాలు వ్యక్తం చేయడంతో, ఒక వీడియో నిన్నటి రోజు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అధికారులు స్పందిస్తూ, “ఆ వీడియోలో ఎటువంటి వాస్తవం లేదు. వారు దరఖాస్తు కూడా చేయలేదు. అలాంటి ఎవరైనా ఉంటే వారిని గుర్తించి న్యాయం చేస్తాం,” అని అన్నారు.

అలాగే, ఈ వ్యవహారంపై పలువురు కార్యకర్తలు స్పందిస్తూ, “ఎలాంటి అవకతవకలు జరగలేదు. ఎంపిక పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగింది,” అని స్పష్టం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india