V1News Telangana

best news portal development company in india

“ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్” పథకం గురించి గిరిజనులకు అవగాహన…

SHARE:

– గిరిజన మెజారిటీ గ్రామాలలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి లక్ష్యంగా పథకం అమలు

– ఔత్సాహికులకు పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు

– గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి పథకం ఉపయోగపడుతుంది

– గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయిని యస్. విజయభారతి

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలో గల సంగం గ్రామంలో గురువారం రోజు గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయిని యస్. విజయభారతి ఆధ్వర్యంలో “ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్” పథకం గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన మెజారిటీ గ్రామాలలో వారికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయడంలో భాగంగా అర్హులైన కుటుంబాలకు పక్కా ఇల్లు, గ్రామీణ మౌలిక వసతులు కల్పించడం మరియు ఔత్సాహికులకు పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించడం, నాణ్యమైన విద్య, మెరుగైన ఆహారం అందరికీ అందేలా చూడడం వంటి పలు అంశాలు ఈ పథకంలో పొందుపరచబడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం గిరిజనుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి “ప్రధానమంత్రి ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్” పథకాన్ని ప్రవేశపెట్టారని ప్రజలకు అర్థమయ్యేలా ఓపికతో, చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పాల్త్య విట్టల్, ఉపాధ్యాయులు సుజాత, సునీత, అనసూయ, జయ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india