V1News Telangana

best news portal development company in india

కల్దుర్కి ఇసుక మాఫియా… కండగావ్ ట్రాక్టర్లకు అడ్డుగోడలు! . ఇసుక పర్మిషన్ పేరుతో ట్రాక్టర్ ముఠాల ఆగడాలు.. ఎమ్మార్వోలా? ట్రాక్టర్ యజమానుల రాజ్యం కల్దుర్కిలో ఇసుక ముఠాల పంజా.. రెవెన్యూ అధికారుల మౌనం ప్రశ్నార్థకం! . ఇందిరమ్మ ఇళ్ల పేరుతో బ్లాక్ మార్కెట్ గేమ్?

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా:ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఇసుక పర్మిషన్ల పేరుతో కల్దుర్కిలో అసలు నాటకమే నడుస్తోంది. ప్రత్యేకంగా కల్దుర్కి మంజీరా పరివాహక ప్రాంతానికి ఇచ్చిన అనుమతులను కొందరు ట్రాక్టర్ యజమానులు బ్లాక్ మార్కెట్‌కు వాడుతూ ప్రభుత్వ ఉద్దేశాలను మసకబారుస్తున్నారు.

ఈ అక్రమాలపై స్పందించాల్సిన రెవెన్యూ అధికారులు… మౌనంగా ఉండటం విచారకరం. ఒక ట్రాక్టర్ యజమాని తానే ఎమ్మార్వో అన్నట్టు వ్యవహరిస్తూ, తన మాటే వేదం అంటూ అధికార వేషం వేస్తుండటం కల్దుర్కి ప్రజాస్వామ్యాన్ని కుంగదీసే వ్యవహారమని ట్రాక్టర్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపై కల్దుర్కి పర్మిషన్లు నిలిపివేయడంతో, అక్కడి ముఠా కండగావ్ ప్రాంతానికి వచ్చి అక్కడి ట్రాక్టర్లకు అడ్డుపడుతున్నారు. ‘నీవు నడపకు.. నేనే నడిపిస్తా’ అనే తీరు తీసుకున్న కల్దుర్కి ముఠా – మంజీరా ఒడ్డున ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నట్లు కనిపిస్తోంది.

పబ్లిక్ పర్మిషన్ పేరుతో ప్రైవేట్ దందా నడిపించేవారిపై చర్యలు తీసుకోవాలని, కల్దుర్కి ట్రాక్టర్లకు ఇకపై కండగావ్ నుంచి పర్మిషన్లు ఇవ్వొద్దని ఇతర యజమానులు డిమాండ్ చేస్తున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india