V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో అనుమతులేని స్కూల్స్‌పై బీవీఎస్ ఆగ్రహం!

SHARE:

. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం – బీవీఎస్ ధ్వజం ఎత్తింది!. రూల్స్ లేకుండా రన్ అవుతున్న స్కూల్స్ – బీవీఎస్ ఘాటు హెచ్చరిక .పుస్తకాలు, యూనిఫారాల పేరుతో దోపిడీ – బీవీఎస్ సూటిగా ప్రశ్న. అక్రమ ఫీజుల వేధింపులు: బీవీఎస్ మండి పడింది!

బోధన్: బోధన్ పట్టణంలో విద్యా మాఫియాపై భారతీయ విద్యార్థి సేన (బీవీఎస్) ఝళిపించడంతో ప్రకంపనలు సృష్టించాయి. అనుమతుల్లేకుండా నడుస్తున్న స్కూల్స్, కాలేజీలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎం.ఈ.ఓ కార్యాలయాన్ని బీవీఎస్ ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తిపోశారు.

పట్టణ బీవీఎస్ అధ్యక్షుడు కస్ప లింగం గర్జిస్తూ, “ఇలా నిబంధనలు అతిక్రమిస్తూ స్కూల్స్ నడిపించడమంటే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడమే! ఇటువంటి అక్రమ విద్యాసంస్థలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, బీవీఎస్ మరింత మిన్నకు వెళ్లే ఆందోళనలతో సిద్ధంగా ఉంది” అంటూ హెచ్చరించారు.
పలు ప్రైవేట్ స్కూల్స్‌లో యూనిఫారాలు, పుస్తకాలు పేరుతో నిర్దాక్షిణ్యంగా వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఇది RTE చట్ట ఉల్లంఘన అని స్పష్టంగా పేర్కొన్నారు. ప్రభుత్వం వేసిన గరిష్ట ఫీజుల నియంత్రణ మార్గదర్శకాలను లెక్కచేయకుండా స్కూల్ మేనేజ్‌మెంట్లు తల్లిదండ్రులపై ఆర్థికంగా ఒత్తిడి తెస్తున్నాయని వాపోయారు.
గతంలో ఇటువంటి అక్రమాలకు అధికారులు ఎంతగా నిర్లక్ష్యం వహించారో గుర్తు చేస్తూ, ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీవీఎస్ ఉపాధ్యక్షుడు ఎసోల్ల ఆకాష్, అరుణ్, ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india