V1News Telangana

best news portal development company in india

నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములపై అక్రమ నిర్మాణాలు – సబ్ కలెక్టరుకు MCPYU వినతి…

SHARE:

. ఇందిరమ్మ ఇళ్లను దుర్వినియోగిస్తున్న కాంగ్రెస్ నేతలు: బోధన్ లో MCPYU ఆరోపణలు..
. ఫ్యాక్టరీ భూముల ఆక్రమణ – అర్హులకు తగనట్లే ఇళ్లు: సబ్ కలెక్టర్ దృష్టికి మెమోరాండం..
బోధన్ లో అక్రమ ఇళ్ల కట్టడంపై ప్రజల ఆందోళన – మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు..

బోధన్, జూన్ 16:బోధన్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలు మరియు ఎం సి పి ఐ యు (MCPYU) పార్టీ నాయకులు ఈరోజు సబ్ కలెక్టర్ గారిని కలిసి ఒక మెమొరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి మోహమ్మద్ మోసిన్ మాట్లాడుతూ, నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూములపై కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు అక్రమంగా ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇళ్లు కడుతున్నారని తెలిపారు.అతను మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కల్పించేందుకు తీసుకువచ్చింది. కానీ బోధన్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో — ముఖ్యంగా సక్కనగర్, శ్రీరామ్ నగర్ కాలనీల్లో — స్వంత ఇళ్లు, వ్యవసాయ భూములు, కార్లు కలిగిన కాంగ్రెస్ నాయకులు సైతం అక్రమంగా లోన్లు మంజూరు చేసుకుంటున్నారు,” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఈ భూములు నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందినవే అని, వాటిపై కట్టడాలకు ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ కాని, పట్టా లేని స్థలాలు అని కూడా మెమోరాండంలో పేర్కొన్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని వారు బోధన్ సబ్ కలెక్టర్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తోట సంగీత, ఉష, శోభ, గౌసియా, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india