V1News Telangana

best news portal development company in india

“ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం నాన్న”….

SHARE:

– పిల్లల బంగారు భవిష్యత్తే నాన్న సంతోషం

– ఫాదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం

కామారెడ్డి ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ప్రపంచంలో ఏ బంధమూ తండ్రి-పిల్లల బంధం అంత గొప్పది కాదేమో ఆ బంధం గొప్పతనం మాటల్లో వర్ణించలేని, నిక్షిప్తమైన, అపారమైన ప్రేమ, త్యాగం దాగి ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఫాదర్స్ డే పురస్కరించుకొని నస్రుల్లాబాద్ మండలంలోని మారుమూల సంగం గ్రామంలో సాధారణ రైతు గిరిజన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ తన ముగ్గురు సంతానానికి ఉన్నత చదువులు చదివిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పాల్త్య విట్టల్. ఫాదర్స్ డే సందర్భంగా అతని పిల్లలు పంచుకున్న వివరాలు పై ప్రత్యేక కథనం నాన్న అనే పదం కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సూచించేది కాదు, తండ్రి అంటే కుటుంబానికి మూల స్తంభం.. అదేవిధంగా ప్రతి పిల్లలకు ఒక ధైర్యం,నమ్మకం,భరోసా, స్ఫూర్తి జీవితంలో ప్రతి ఒక్కరికి నాన్న గురువు, ఆదర్శం,మార్గదర్శి గా వ్యవహరిస్తారు.సాధారణ రైతు కుటుంబంలో జన్మించి పెద్దగా ఉన్నత చదువులు చదువుకోకపోయినా.. జీవిత పాఠాలు అతనిని సన్మార్గంలో నడిపించి అభివృద్ధి చెందే విధంగా దోహదపడ్డాయి. కుటుంబాన్ని పోషించడానికి కష్టపడిన తీరు వివరించినప్పుడు కళ్ళు చెమ్మగిల్లక మానవు. “పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు “వేయడానికి భారానికి మించి కష్టపడిన తీరు అమోఘం. కుటుంబ భారాన్ని మోస్తూ తన వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి పిల్లల కోరికలను తీరుస్తూ వారి సంతోషంతో సంతృప్తి పొందే గొప్ప వ్యక్తి నాన్న..తన కష్టాలను ఎదుటి వారికి తెలియకుండా..ఎన్ని సమస్యలున్నా ముఖంపై చిరునవ్వు చెదరకుండా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులకు, పిల్లలకు ధైర్యం చెబుతూ సన్మార్గంలో నడిపించే గొప్ప గురువు అయ్యారు. పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్తేజాన్ని నింపి వారిని అభివృద్ధి పథంలో నడిపించే విధానం పలువురికి స్ఫూర్తినిచ్చే విషయం .. నాన్న పడే త్యాగం, పంచే ప్రేమ నిస్వార్థమైనది, నిరుపమానమైనది. నాన్న ప్రతి పిల్లలకు దైవం. లోకం.. నాన్న అనే పిలుపులో దాగి ఉన్న మాధుర్యం, ఆప్యాయత, అనురాగం, త్యాగం… అన్నీ కల గలిపితే “నాన్న” అనే పదం “కొలమానం లేని ఒక గొప్ప మహా వృక్షం” అని అభిప్రాయం.

– *పిల్లలకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా*…

పాల్త్య విట్టల్ పిల్లలకు ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఆయన పెద్ద కూతురు పద్మావతి హైదరాబాద్ లో బీడీఎస్ పూర్తి చేసుకున్న తర్వాత అమెరికాలో ఎమ్మెస్ చదవడానికి పంపించారు. సాధారణ వ్యవసాయం చేస్తూ అమ్మాయిని అమెరికా పంపించడం అనేది మామూలు విషయం కాదు. అంతేకాకుండా రెండవ కూతురు భావన డిగ్రీ పూర్తి చేసుకుంది. కుమారుడు వినయ్ బీటెక్ చదువుతున్నాడు. పిల్లలను క్రమశిక్షణతో పెంచిన అతని తీరు పలువురికి ఆదర్శం.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india