V1News Telangana

best news portal development company in india

బోధన్ శాంతి పర్యటనలో సీఐ సందేశం: చట్టాన్ని గౌరవించండి, భద్రతకు తోడ్పడండి. మీకు మేమున్నాం” – ప్రజలకు భరోసా ఇస్తున్న బోధన్ టౌన్ సీఐ వెంకటనారాయణ…

SHARE:

బోధన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పహరా. శాంతి భద్రతకు విఘాతం కలిగించేవారిపై సమాచారం ఇవ్వండి – బోధన్ పోలీసుల విజ్ఞప్తి.పౌర భద్రతకు ప్రజా సహకారం అవసరం – పోలీసుల పిలుపు.:..

బోధన్ పట్టణ శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు. టౌన్ సీఐ శ్రీ వెంకటనారాయణ గారు ప్రజలకు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చారు – “మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేమున్నాం. భయపడకుండా పోలీసులను సంప్రదించండి.”ఈ సందర్భంలో షార్భత్ కెనాల్ నుండి ఓల్డ్ బస్టాండ్ వరకు ఏర్పాటు చేసిన పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాషాబై, కౌన్సిలర్ జావిద్ గారు పాల్గొన్నారు. స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు జరిగినట్లు సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
పౌరుల నుంచి సహకారం పొందేందుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు – ఎవరైనా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం గానీ, భద్రతకు విఘాతం కలిగించే చట్టవిరుద్ధ కార్యకలాపాలు గానీ గమనించినా, వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. పోలీసులు హామీ ఇచ్చారు – సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.
ఈ చర్యలు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రజల భద్రతే తమ ప్రథమ లక్ష్యమని బోధన్ పోలీసులు స్పష్టం చేశారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india