V1News Telangana

best news portal development company in india

సాలూరలో అధికారుల దుర్వినియోగం – కబ్జాలపై కక్కుర్తి! . పంటకాలువలపై కబ్జాలు… అధికారులు చేతులు దులుపుకుంటున్నారా? నోటీసులు పేరిట నాటకం – సర్వేలు ఎప్పుడు? చర్యలు ఎక్కడ? ఊరిని కాపాడాల్సినవారే భూకబ్జాదారుల తోకలు అవుతున్నారా? సాలూర కబ్జాలు: పై అధికారుల స్పందన కోసం ప్రజలు ఎదురుచూపులు!

SHARE:

శనివారం: 14 జూన్ 2025:సాలూరు మండలం – నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో భూకబ్జాలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. పంటకాలువలు, పానాదులు ఇలా ప్రజలకు అవసరమైన ప్రభుత్వ భూములు అక్రమ ఆక్రమణలకు గురవుతుండగా, దీనిపై స్థానిక అధికారులు మాత్రం “నోటీసులు జారీ చేశాం” అనే పేరుతో చేతులు దులుపుకుంటున్నారు. కక్షిదారుల చెంతకు వెళ్లే ప్రయత్నమే చేయని తీరుతో గ్రామస్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారట…

ఎంక్వయిరీకి వచ్చిన పై అధికారుల ముందు కబ్జాదారులపై చర్యలు తీసుకున్నట్టు చెప్పి నాటకం ఆడుతున్న అధికారులు నిజంగా కబ్జా మాఫియాకు తోకలు పట్టినట్లే కనిపిస్తోంది.
“ఊరిని కాపాడవలసిన వారు కబ్జాదారుల బాటలోకి వెళ్తే, ప్రజలకు న్యాయం దక్కేదెక్కడి నుంచి?” అని ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు గ్రామస్థులు.

నోటీసులు ఇచ్చినంత మాత్రానే బాధ్యత ముగుస్తుందా?
సర్వేలు ఎందుకు చేయట్లేదు?
కబ్జాలు చేసినవారిపై ఎలాంటి శిక్షా చర్యలు తీసుకోట్లేదంటే, దీనిపై పై అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?

ఇక అక్కడితో story ఆగడం లేదు – కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ భూకబ్జా వ్యవహారంలో ముళ్లుగా మారినట్టు సమాచారం.
“కబ్జాదారుల వెనుక మేమున్నాం” అంటూ కొందరు నేతలు బలవంతపు సెటిల్మెంట్లకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుండటమే కాదు, అధికారులను ఒత్తిడికి లోనిచేస్తున్నట్టు గ్రామస్థుల వాదన.

ఈ పరిణామాల నేపధ్యంలో సాలూర పంటకాలువలు, పానాదుల భూములు కబ్జా మాఫియాల నుండి కాపాడాలంటే, తక్షణమే స్పష్టమైన సర్వేలు, కఠిన చర్యలు, రాజకీయ ఒత్తిడులపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించకపోతే, ప్రజల ఆత్మవిశ్వాసం అధికారులు, పాలనలపై పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని మండల వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india