V1News Telangana

best news portal development company in india

మహిళలు అక్షరాస్యులుగా అభివృద్ధి చెందాలి….

SHARE:

– “అమ్మకు అక్షరాభ్యాసము”కార్యక్రమం నిర్వహణ

– వయోజన విద్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ల ఆధ్వర్యంలో శిక్షణ

– మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలి

– ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు కృషి చేస్తుందని సూచనలు

– నసురుల్లాబాద్ ఎంపీడీవో సూర్యకాంత్

నసురుల్లాబాద్ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం రోజు వయోజన విద్య మరియు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కామారెడ్డి శాఖ ల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరక్షరాస్యులు అయిన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి “అమ్మకు అక్షరాభ్యాసము” అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నసురుల్లాబాద్ మండల ఎంపీడీవో సూర్యకాంత్ ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు మహిళలకు ఓపికగా, సులువైన పద్ధతిలో అక్షరాలు రాసే విధానాన్ని బోధించారు. మహిళలు సైతం వారు బోధించే విధానాన్ని అనుసరిస్తూ చక్కగా నేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సూర్యకాంత్ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలందరూ అక్షరాస్యులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అక్షరాస్యులు కావడం వలన చదువుతోపాటు, జ్ఞానం కూడా కలుగుతుందని తద్వారా తమ తమ మహిళా సంఘాలలో జరిగే ఆర్థిక లావాదేవీలను, తీర్మానాలను చదువుకోవడానికి వీలవుతుందని అదేవిధంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కొరకు ఎన్నో కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు. “అమ్మకు అక్షరాభ్యాసము”కార్యక్రమాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం గంగాధర్, సీసీ, సిఏలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india