Post Views: 26
– బిజెపి జిల్లా కౌన్సిల్ మెంబర్ సున్నం సాయిలు
కామారెడ్డి జిల్లా: నసురుల్లాబాద్ మండల కేంద్రంలో విధులు నిర్వహించిన పలువురు పోలీసులు ఇటీవల వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసినదే.. శుక్రవారం రోజు బిజెపి నాయకులు వారిని పోలీస్ స్టేషన్ లో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో విధులు నిర్వహించిన సమయంలో వారు అందరితో స్నేహపూర్వకంగా మెదులుతూ, నిబద్ధతతో పనిచేసిన తీరును గుర్తు చేశారు. బదిలీపై వెళ్లిన చోట అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అందరి మన్ననలను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మేకల రాములు యాదవ్, కానిస్టేబుల్ లు తదితరులు పాల్గొన్నారు.

Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..