V1News Telangana

best news portal development company in india

11 ఏళ్ల తరువాత భవానిపేట్ ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం…

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని భవానిపేట్ గ్రామంలో గత 11 సంవత్సరాలుగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ గ, మండల అభివృద్ధి అధికారి (ఎంపీడిఓ) బోధన్, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) బోధన్, మండల పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ అధికారి (ఎంపీఓ) పాల్గొన్నారు.

పాఠశాల మూతపడ్డనాటి నుండి విద్యార్థుల పరిస్థితిపై గ్రామస్తులు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారు. అధికారుల స్పందనతో, పాఠశాలను మళ్లీ ప్రారంభించి పిల్లలకు స్థానికంగా విద్యను అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

గ్రామంలోని విద్యార్ధుల భవిష్యత్తుకు ఇది ఒక సానుకూల అడుగుగా ప్రజలు అభిప్రాయపడ్డారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india