V1News Telangana

best news portal development company in india

హైదరాబాద్‌లో 300 వరద ముంపు ప్రదేశాలు: హైడ్రా హెచ్చరిక…

SHARE:

హైదరాబాద్ నగరంలో వర్షాకాలం మొదలవుతుండగానే వరద భీతిని హైడ్రా అధికారి ఎత్తిచూపారు. “నగరంలోని 300 ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ప్రమాదం ఉంది,” అని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ వెల్లడించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లను గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి హైడ్రా కిందకు తరలించారని తెలిపారు.

వర్షాకాల విపత్తు నిర్వహణకు సమన్వితంగా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని ఆయన స్పష్టం చేశారు. “వరద నీటిని చెరువులు, నాలాల్లోకి మళ్లించే వ్యవస్థ దుర్వలంగా ఉంది. దీనిని బలోపేతం చేయడంపైనే మేం దృష్టి సారించాం. ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసాము,” అని రంగనాథ్ చెప్పారు.

నగరవాసులు వర్షాకాలాన్ని భయపడకుండా ఎదుర్కొనాలన్నదే లక్ష్యమని ఆయన హామీ ఇచ్చారు. అయితే, గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే నగరాన్ని వరదల నుంచి కాపాడటం కోసం తీవ్ర చర్యలు అవసరం అని స్పష్టమవుతోంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india