V1News Telangana

best news portal development company in india

అమరావతి మహిళలపై జాతిపితలదాన్ని తుంచిన కొమ్మినేని… మరో మూడు పోలీస్ కేసులు!”

SHARE:

జూన్ 10, 2025.సీనియర్ జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఇప్పుడు తన మాటలే ముంచుతున్నాయేమో అన్న పరిస్థితి నెలకొంది. అమరావతి మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన కొమ్మినేనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. దీనితో పాటు ఆయనపై మరో మూడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

మహిళల పరువును లాకెళ్లిన వ్యాఖ్యలు చేసిన కొమ్మినేనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా టీడీపీ మహిళా నేతలు పోలీస్ స్టేషన్ల బాట పట్టారు.

సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫిర్యాదు చేయగా,

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎన్టీఆర్ జిల్లాలోని పడమట పోలీస్ స్టేషన్‌లో తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఫిర్యాదు చేశారు.

ఈ మూడు ఫిర్యాదులపై పోలీసులు వెంటనే స్పందించి కేసులు నమోదు చేశారు. అభిప్రాయ స్వేచ్ఛ అనే పేరు చెప్పుకుని మహిళల గౌరవాన్ని తూర్పారబెట్టే హక్కు ఎవరికీ లేదని మండిపడుతున్నారు టీడీపీ నేతలు.

ప్రజా జీవితంలో ఉండే వారికి మాటల్లో మెలకువ అవసరం. కానీ కొమ్మినేని వ్యవహారశైలి చూస్తుంటే అది ఎప్పుడో మరిచిన పాఠంగా ఉంది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india