V1News Telangana

best news portal development company in india

“నేనే రాజు నేనే మంత్రి!” – లింగంపల్లి తండాలో పేకాట రాజ్యాంగం.

SHARE:

పేకాట గుట్టల్లో చట్టానికి చీకటి చూపుడు – ఎవరు ఏం చేస్తారంటే!…
అక్కడ చట్టం లేదు.. రాజు మాటే శాసనం!…
పేకాట పేరుతో యువత జీవితాలను బలి తీసుకుంటున్న ముఠా!…
అధికారులు నిశ్చలంగా.. పేకాట రాయుడు రాజుగా!….

నసర్లాబాద్ మండలం లింగంపల్లి:-నసర్లబాద్ మండలం లింగంపల్లి తండా శివారులో “నేనే రాజు నేనే మంత్రి!” అన్నట్టుగా పేకాట ముఠాలు చట్టాన్ని బల్లగుద్దుతున్నాయి.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కు చెందిన భూభాగంలో, స్మశాన వాటిక పక్కన గుట్టల మధ్యలో, పేకాట గూటిగా మారింది. ‘రాజు.’ అనే వ్యక్తి ఆధ్వర్యంలో యథేచ్ఛగా జూదం కొనసాగుతోంది. “మా వెంటే అధికారులు ఉన్నారు.. ఏం చేస్తారు?” అంటూ స్థానికుల మానసిక శాంతిని చిద్రం చేస్తున్నాడు.
తిండి, మందు, మత్తు పదార్థాలతో మాయ మాటలు…
ఇక్కడికి వచ్చిన వారు ఓసారి పట్టుబడితే అంతే – అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడాల్సిందే. అధిక వడ్డీలతో డబ్బులు వసూలు, విలువైన వస్తువులు తాకట్టు, అనైతిక ఆర్థిక లావాదేవీలు… అన్నీ ఈ గుట్టల మధ్య నడుస్తున్న అసహ్యమైన వ్యాపారం.
అధికారుల కు చీమ కుట్టినట్టైనా లేదు!
స్థానికులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించని అధికారులు ఇప్పుడు ప్రజలకే అనుమానాస్పదంగా మారారు. “రాజు మాటలకే పనిచేస్తున్నారా?” అని ప్రశ్నలు గళమెత్తుతున్నాయి.
ఈ అజ్ఞాత రాజ్యానికి తెరదించేది ఎవరూ?
ఈ పేకాట గుట్టలు కూల్చి, యువత భవిష్యత్తును కాపాడే బాధ్యత ఎవరిపై? ఇప్పటికైనా అధికార యంత్రాంగం మేలుకోకపోతే, ఇంకెంత మంది రోడ్డుపాలవుతారో తెలియదు!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india