V1News Telangana

best news portal development company in india

రేపు బోధన్ బంద్: మంత్రివర్గంలో ఎంపిక కాకపోవడంపై కార్యకర్తల ఆగ్రహపు జ్వాలలు!…

SHARE:

“సుదర్శన్ రెడ్డి.కి న్యాయం కావాలి!” –  రేపు బోధన్ బంద్‌తో కాంగ్రెస్ కార్యకర్తల బహిరంగ పోరాటం…
బోధన్ ఉరుము – మంత్రి పదవికి నో చెప్పిన అధిష్ఠానంపై కార్యకర్తల ధ్వజం…
క్యాబినెట్‌లో చోటు లేకపోవడంపై బోధన్ కోపగ్నికి కరిగిపోతున్న కాంగ్రెస్ శిబిరం…
నాయకుడికి అన్యాయం.. నియోజకవర్గం బంద్‌కు పిలుపు – బోధన్ గర్జన!…
“అధిష్ఠానమే అన్యాయానికి మార్గదర్శి!” – సుదర్శన్ రెడ్డి.అభిమానుల ఆందోళన…

నిజామాబాద్ జిల్లా – బోధన్: బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించకపోవడం స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల్ని ఊగలేసింది. తమ నాయకుడికి అన్యాయం జరిగిందన్న భావనతో రేగిన ఆవేశం బంద్ రూపంలో విరుచుకుపడింది.

కార్యకర్తలు  బోధన్ నియోజకవర్గ బంద్‌కి పిలుపునిచ్చారు. “అన్ని రాజకీయ ప్రాధాన్యాలు తుంచేసి నాయకత్వాన్ని ద్రోహించారు” అంటూ నాయకులు మండిపడ్డారు. నియోజకవర్గానికి న్యాయం జరగాల్సిందేనంటూ బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బంద్ సందర్భంగా రోడ్డులపైకి వస్తామని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతామని కార్యకర్తలు పేర్కొన్నారు. అధిష్ఠానం తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఇదేనా నమ్మిన నేతకు ఇచ్చే గౌరవం?” అని ప్రశ్నించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india