V1News Telangana

best news portal development company in india

బోధన్‌లో దివ్యాంగుల బడిబాట! – మారాలి విధానాలు, మారాలి దృష్టికోణం!

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ మహాలక్ష్మి కళ్యాణమండపం… వేదికగా మారింది ఒక జాగృతికి!
స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ‘బడిబాట’ కార్యక్రమం దివ్యాంగుల హక్కులపై, వారి భవిష్యత్తుపై మరింత చైతన్యాన్ని నూరింది. అభివృద్ధి అంటే కేవలం గడిచిన దూరం కాదు… అందరికీ సమాన అవకాశం కల్పించడమేనన్న సందేశాన్ని ఈ కార్యక్రమం బలంగా ఇచ్చింది…

.
కీలక పాత్రధారులు:
సిద్దయ్య – స్నేహ సొసైటీ రూరల్ రీకన్స్ట్రక్షన్‌కి ప్రతినిధిగా మారి, గ్రామీణ దివ్యాంగుల సమస్యలను ధైర్యంగా వినిపించారు.

జ్యోతి – ప్రిన్సిపాల్‌గా, విద్యతోనే మార్పు సాధ్యమని స్పష్టం చేశారు.

ఆసియా బేగం, రాధిక – సూపర్‌వైజర్లుగా, రంగంలో ఉండే అనుభవంతో మాట్లాడి, సమర్థత కలిగి ఉన్న ప్రభుత్వ వ్యవస్థలకే ప్రశ్నగా నిలిచారు.

ఆర్. కుమార్ – ORW గా స్నేహ సంస్థ తరఫున బాధ్యతగా వ్యవహరించి, దివ్యాంగుల సమస్యలపై వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు.

ఈ కార్యక్రమానికి హాజరైన దివ్యాంగులు, అధికారుల సమక్షంలో అనేక సమస్యలు, అడ్డంకులు, సూచనలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇదంతా ఒక రోజు కార్యక్రమం కాదు… దీన్ని చర్యల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.

ప్రభుత్వం కరగాలి… విధానాలు మారాలి… దివ్యాంగుల జీవితం మారాలి!
ఇలాంటి బడిబాటలు మక్కువకే కాదు – మార్పుకే నాంది కావాలి!

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india