V1News Telangana

best news portal development company in india

పాఠశాల భవనం కూల్చిన నిర్లక్ష్య ప్రభుత్వం – విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం..

SHARE:

అంతర్నీ భవనం విషాదం – విద్యాశాఖపై మండిపడ్డ ఎమ్మెల్యే పవార్ రామారావు…
జిల్లా విద్యాధికారి సస్పెన్షన్ డిమాండ్ – పాఠశాలలపై మళ్లీ మేల్కొలిపిన విషాదం…
. చిన్నారి కేకలు.. శిథిలాల భయంకర దృశ్యం – ఎవరి బాధ్యత ఇది?…
నిర్లక్ష్యం అనే నాశనం – ప్రభుత్వ అజాగ్రత్తకు బలైన విద్యార్థులు…

కుబీర్ మండలం, జూన్ 7:అంతర్నీ పాఠశాలలో చోటుచేసుకున్న విషాద ఘటన విద్యా వ్యవస్థలోని శిథిలాన్ని మరోసారి ఎండగట్టింది. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం కూలిపోవడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. బాధితులను బైంసా ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. గాయాలైన విద్యార్థులను ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు తీవ్రంగా స్పందించారు. ‘‘ఇది ప్రమాదం కాదు – ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం,’’ అని వ్యాఖ్యానించారు. శిథిల భవనాలను ఎప్పటికప్పుడు కూల్చివేయకుండా, చిన్నారుల ప్రాణాలను గాలికి వదిలేసిన అధికార యంత్రాంగంపై మండిపడ్డారు. ఈ ఘటనకు జిల్లా విద్యాధికారి నేరుగా బాధ్యత వహించాలంటూ ఆయన సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
‘‘అసెంబ్లీలో అనేకసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాం. కానీ అధికారులు కన్నెముకలేని విధంగా వ్యవహరించారు. ఇది ఇక చాలు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఉద్యమమే మార్గం అవుతుంది,’’ అంటూ హెచ్చరించారు.
నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల భద్రతా పరిస్థితులను సమీక్షించి, శిథిల భవనాల జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు ఆయన తెలిపారు. ‘‘ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూస్తాం. ఇది కేవలం ఒక ఘటన కాదు.. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం,’’ అంటూ అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india