V1News Telangana

best news portal development company in india

పేదల పాలిట ఆపద్బాంధవుడిగా ఆదుకుంటున్న ప్రవాస భారతీయుడు…..

SHARE:

– ప్రమాదవశాత్తు గాయపడిన వ్యక్తికి రూ.6000 ఆర్థిక సహాయం

– ప్రతినెల కోనేరు ట్రస్ట్ ద్వారా మందులు అందజేస్తామని భరోసా

– టీబీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రూ.5000 ఆర్థిక సహాయం

– ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు

– బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్

రుద్రూర్ ప్రతినిధి:

నిజామాబాద్ జిల్లా : రుద్రూర్ మండలానికి చెందిన ఏముల సాయిలు అనే వ్యక్తి గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇబ్బందులు పడుతున్నాడు. దీంతోపాటు అదే గ్రామానికి చెందిన ధర్మారం వెంకటేష్ అనే వ్యక్తి టీబీ (క్షయ) వ్యాధితో బాధపడుతున్నారు.ఈ విషయాన్ని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ చొరవ తీసుకొని బిజెపి నాయకులు, NRI కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై గొప్ప మనసుతో వెంటనే స్పందించిన ఆయన ఇటీవల వారిని కలిసి దైర్యం చెప్పి తన వంతు ఆర్ధిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం గురువారం రోజు కోనేరు తరుణ్ సాయి తేజ మరియు ఆలపాటి హరికృష్ణ చేతుల మీదుగా ఏముల సాయిలు అనే వ్యక్తికి ఆర్థిక సహాయం రూ.6000 బ్యాంకు చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు. దీంతోపాటు కోనేరు ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మందులు ఇపిస్తానని వారి కుటుంబ సభ్యులను ఓదార్చి భరోసా ఇచ్చారు. అదేవిధంగా ధర్మారం వెంకటేష్ కు ఆర్థిక సహాయం రూ.5000 బ్యాంకు చెక్కును అందించారు. మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి సహాయం అందించినందుకు బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో బిజెపి పోతంగల్ మాజీ మండల అధ్యక్షులు ప్రకాష్ పటేల్, ఆలపాటి హరికృష్ణ, ఏముల గజేందర్, ప్రశాంత్ గౌడ్, కుమ్మరి గణేష్, వినోద్ కుమార్, బేగటి శివప్రసాద్, సాయికుమార్,బోజిగొండ అనిల్, కుర్లెపు గంగాధర్, రేపల్లి సాయి ప్రసాద్,కోరుట్ల సాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india