V1News Telangana

best news portal development company in india

సాలూర భూభారతి సదస్సుకు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

SHARE:

సాలూరమండల కేంద్రంలో ఈరోజు నిర్వహించిన భూభారతి సమస్యల పరిష్కార సదస్సులో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఆయనతో పాటు బోధన్ సబ్ కలెక్టర్  కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రస్తావించిన పత్రాలను సమీక్షించారు. స్థానిక ప్రజల నుంచి పలు అభ్యంతరాలు, సమస్యలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో సాలూరు ఎమ్మార్వో శశిభూషణ్, ఇతర రెవెన్యూ అధికారులు, అనధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

భూభారతి చట్టాన్ని ప్రజల పక్షాన సమర్థంగా అమలు చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ సదస్సులో అధికారుల చర్యలు ప్రజల్లో విశ్వాసం కలిగించేలా సాగాయి.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india