V1News Telangana

best news portal development company in india

బార్ల వెనుక ఉన్న అధికారుల మౌనం ఎందుకు?” – బోధన్ బీజేపీ ఘాటు ప్రశ్న! “రిపోర్టర్ పై దాడి… బార్ యాజమాన్యంపై ?” – బీజేపీ గోపి ఆగ్రహం.. “అర్ధరాత్రి వరకు మద్యం విక్రయాలు… ఎక్సైజ్, పోలీసులే చౌకగా మారిపోయారా?” “బార్ దందాలపై అధికారుల మౌనం – బీజేపీ బూతులేచిన బండి” “రిపోర్టర్‌పై దాడి చేయడం చట్ట విరుద్ధం… అధికారులు ఎందుకు మూగవారుగా?”

SHARE:

బోధన్, నిజామాబాద్ జిల్లా:
బోధన్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో టౌన్ ప్రెసిడెంట్ గోపి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల MSR బార్ యాజమాన్యం ఒక సీనియర్ రిపోర్టర్‌పై దాడికి పాల్పడిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఒకవైపు రాత్రి 12 గంటల వరకు అక్రమంగా మద్యం అమ్మకం జరుగుతోంది. మరోవైపు, ఈ అక్రమాలకు అడ్డుగా నిలిచిన రిపోర్టర్‌ను కొడుతున్నారు. ఇది క్షమించదగిన విషయం కాదు. ఎక్సైజ్, పోలీస్ శాఖ అధికారులు చుస్తూ కూడా నోరెత్తడం లేదు. వాళ్లకు బార్ యాజమాన్యం ముట్టా వేసిందా?” అంటూ గోపి ప్రశ్నించారు.

MSR బార్ యాజమాన్యం సిబందిపై వెంటనే కేసు నమోదు చేయాలని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మీడియా స్వేచ్ఛపై దాడిని బీజేపీ సహించదని హెచ్చరించారు. అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తున్నదని, ఇది బార్ దందాలకు పాలకుల మద్దతునే సూచిస్తున్నదన్నారు

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india