V1News Telangana

best news portal development company in india

బోరేగాం విషాదం‌పై కాంగ్రెస్ మౌనం – జైభీం వాదుల ఆక్రోశం!”

SHARE:

బోరేగాం గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న దుర్విపాకంపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ స్పందించకపోవడంపై జై భీమ్ వాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా ప్రజల సమస్యలపై స్పందించకపోవడం దారుణమని వారు మండిపడుతున్నారు.

“చేపట్టాల్సింది ముందుగా ఏమిటంటే – ఇది చార అన్నయ్యల విషయంలో న్యాయం సాధించాల్సిన సందర్భం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది కొనసాగుతుండటమే మాకింత బాధ కలిగిస్తోంది,” అంటూ ఒక కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు.

అంబేద్కర్ పేరును వాడుకుంటూ సిద్ధాంతాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థి MLA అయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, అసలే ఆయనది లొడింగ్ రాజకీయమేనని ప్రజలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

“పార్టీలో ఉండి కూడా ప్రశ్నించని వారు, పార్టీ మీద పోస్ట్‌లు పెట్టే హక్కు లేదు,” అంటూ ఒక జై భీమ్ కార్యకర్త తేల్చిచెప్పాడు. “చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పక్షాన నిలబడండి. లేకపోతే సైలెంట్ గానే ఉండండి,” అని హితవు పలికారు.

chandre Prakash
Author: chandre Prakash

నిర్మల్ డిస్టిక్. స్టాఫ్ రిపోర్టర్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్. ప్రకాష్. +91 90102 20533

best news portal development company in india